అందరికీ ప్రాథమిక హక్కులు
రాయగడ: మన రాజ్యాంగం ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులను కల్పించి సమానత్వం చాటి చెప్పిందని, ఇతరుల హక్కులను భంగపరిచే హక్కు ఎవరికీ లేదని డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి అన్నారు. స్థానిక అటానమన్ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా మానవహక్కుల కౌన్సిల్ బుధవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తమ హక్కుల కోసం పోరాడాలని హితవు పలికారు. కౌన్సిల్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సస్మిత మహాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈస్ట్ ఇండియా జోనల్ కార్యదర్శి లీనా సనాపతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతిరే, బచ్‌పన్ స్కూల్ డైరెక్టర్ శుశ్రీత దాస్, అధ్యాపకుడు అరుణ్‌కుమార్, దక్షిణ ఒడిశా అధ్యక్షుడు బి.వెంకటరమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజానికి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్న కుమారి బడిత్య, సుకృ సాహు, రచయిత, పాత్రికేయుడు భళ్లమూడి నాగరాజు తన చైతన్య వంతమైన రచనలతో జాగృతి కల్పిస్తున్నందుకు సన్మానించారు.


