శ్రీ మందిరంలో దివ్యాంగుల సులభ దర్శనం కోసం సన్నాహాలు
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో దివ్యాంగులకు సులభ దర్శనం కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి అధ్యక్షతన ఆలయంలో దివ్యాంగుల సులభ దర్శన వ్యవస్థపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు, సీనియర్ సేవకులు, ఆలయ సీనియర్ అధికారులు హాజరయ్యారు. దివ్యాంగుల సౌలభ్యం కోసం సమావేశంలో చర్చించిన ప్రతిపాదిత మార్గదర్శకాలను త్వర లో జరగనున్న ఛొత్తీషా నియోగ్ సమావేశంలో ప్రవేశ పెడతారు. పాలక మండలి ఆమోదంతో దివ్యాంగుల సులభ దర్శనం మార్గదర్శకాలు వాస్తవంగా అమలు చేస్తామని ప్రధాన నిర్వాహకుడు అరవింద్ కుమార్ పాఢి తెలిపారు.
వికాస పరిషత్
ఉచిత వైద్య శిబిరం
జయపురం: జయపురం సరస్వతీ శిశు విద్యామందిర ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాస పరిషత్ జయపురం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు పరిసరప్రాంతాలలో ఉండే పిల్లలకు, పెద్దలకు వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు. సరస్వతీ విద్యామందిరానికి చెందిన 300 మందికి పైగా పిల్లలకు వైద్య పరీక్షలు జరిపి వారికి మందులు అందజేసినట్లు హోమియోపతిక్ డాక్టర్ సుదర్శణ గౌఢ వెల్లడించారు. వైద్య శిబిరంలో కవిరాజ్ పరమేశ్వర ప్రధాన్, డాక్టర్ సత్యనారాయణ పొరిచ, డాక్టర్ శ్రీనివాస పాత్రో, డాక్టర్ లిలు పాత్రో, డాక్టర్ శశికాంత పాత్రో వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సరస్వతీ విద్యామందిర ప్రధాన ఆచార్య సత్యనారాయణ సెఠి, ఉపాధ్యాయులు దిలీప్ కుమార్ శతపతి సహకరించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జగన్నాధ కాశీ (17)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మంగళవారం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జగన్నాధ కాశీ, అనంత మినియాక, దేవరాజ్ ప్రస్కాలు బైక్‌పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాశీ సంఘటనా స్థలం వద్దే మృతి చెందగా బైక్‌పై ప్రయాణించే మినియాక, దేవరాజ్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
శ్రీ మందిరంలో దివ్యాంగుల సులభ దర్శనం కోసం సన్నాహాలు


