పాఠశాల గేటు వద్ద విద్యార్థుల ఆందోళన
రాయగడ: జిల్లాలోని రామనగుడలో గల ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో అధిక ఫీజులు వసూ లు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల మెయిన్ గేటును మూసి వేసి ఆందోళన చేశారు. పాఠశాలలో గల ప్లస్ టూ ఆర్ట్స్ విభాగంలో పేర్ల నమోదు, రీ అడ్మిషన్, ఫారం నింపే విషయంలో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థు లు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవ్వరూ తగిన రీతిన స్పందించకపోవడంతో ఆందోళన చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ గౌరి ప్రసాద్ సాహు సకాలంలో పాఠశాలకు హాజరుకావడం లేదని, అదేవిధంగా హాజరైనా ఎక్కువ సమయం ఉండటం లేదని దీంతో తమ సమస్యలను తెలియజేసేందుకు ఇబ్బందిగా మారుతుందని వివరించారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే తమను పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరిస్తుండటం ఎంతవరకు సమంజసమని అన్నారు. విద్యార్థుల ఆరోపణలు ఏ మాత్రం నిజం కాదని ప్రిన్సిపాల్ పండ కొట్టిపారేశారు.


