రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్కాపంగ పంచాయతీ హెంబు గ్రామ సమీపంలో గల మలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలొ ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు సుభాష్ పాలిక (61), గాయపడిన వ్యక్తి భాస్కర్ కౌసల్యలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మునిగుడ హాస్పటల్‌కు సోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రుడిని అంబెలెన్స్‌లో చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం పిస్కాపంగ నుంచి స్కూటీపై సుభాష్, భాస్కర్‌లు గుడారిలో జరిగే హోమ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బైకును హెంబు మలుపు వద్ద అదుపుతప్పి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుభాష్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడి భాస్కర్‌ను మునిగుడ హాస్పటిల్‌కు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ హాస్పటిల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


