రాష్ట్రంలో మత్తుపూరిత దగ్గు సిరప్ రవాణాకు కళ్లెం
భువనేశ్వర్ : రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి భారీ మొ త్తంలో మత్తుపూరిత దగ్గు సిరప్ సీసాలను స్వాధీ నం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు. మత్తు పూరిత దగ్గు సిరప్ అక్రమ రవాణా కింద రాష్ట్ర పోలీసులు మొ త్తం 61 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా 73,181 మత్తు పూరిత దగ్గు సిరప్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ లావాదేవీలో పాల్గొన్న 181 మంది నిందితులను అరెస్టు చేశారు. భువనేశ్వ ర్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అత్యధికంగా 26,658 దగ్గు సిరప్ సీసాలను స్వాధీనం చేసుకుంది. సంబల్‌పూర్ జిల్లా పోలీసులు 13 కేసులు నమో దు చేసి 19,908 బాటిళ్ల దగ్గు సిరప్‌ను స్వాధీనం చేసుకున్నారు. బర్‌గఢ్ జిల్లా పోలీసులు 17 కేసులు నమోదు చేసి 12,856 సీసాలు, బొలంగీర్ 12 కేసులతో 5,468 సీసాలు, సువర్ణపూర్ జిల్లా 6 కేసులతో 451 సీసాలు, బౌధ్ జిల్లా 4 కేసులతో 1886 సీసాలు మరియు సుందర్‌గఢ్ జిల్లా 3 కేసులతో 595 సీసాల దగ్గు సిరప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంబల్‌పూర్ జిల్లా పోలీసులు 66 మందిని, బర్‌గఢ్ పోలీసులు 64 మందిని, బొలంగీర్ పోలీసులు 23 మందిని, సుబర్ణపూర్ పోలీసులు ఏడుగురిని, సుందర్‌గఢ్ ఆరుగురిని, కెంజొహర్ జిల్లా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించడంలో పోలీసుల చొరవని ప్రదర్శిస్తుందని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యకలాపా లు కొనసాగుతాయని, మాదక ద్రవ్యాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలియజేశారు.


