ఏనుగుల హల్‌చల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మ బ్లాక్‌లో పరిడా పంచాయతీ జన్నిగుడ, అధంగుడ, రాధాకాంత పూర్ ఏజెన్సీలో నాలుగు అటవీ ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనచోదకుడిని వెంబడించింది. దీంతో బైక్ వదిలి పారిపోయాడు. బైక్‌ను తొక్కి నాశనం చేశాయి.
వేటగాళ్ల ఉచ్చులో చిరుత
భువనేశ్వర్: అంగుల్ ప్రాంతంలో ఓ చిరుత పులి ఉచ్చులో చిక్కుకుని మృతిచెందిది. కొరొతొపొట్టా సెక్షన్‌లోని హిడిసింఘి అడవిలో వేటగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకున్న చిరుతను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతి చెందిందని ప్రకటించారు.


