బంగారు శంఖం పేరిట టోకరా
కొరాపుట్ : నకిలీ బంగారం శంఖం అమ్ముతున్న ముఠాను నబరంగ్‌పూర్ జిల్లా మైదల్‌పూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిల్లాలో ఈ ముఠా తమకు తవ్వకాలలో పురాతన బంగారు శంఖం దొరికిందని అమాయకులను నమ్మబలుకుతున్నారు. అనంతరం తక్కువ ధరకి అమ్ముతున్నామని చెప్పి దొరికిన డబ్బుతో ఉడాయిస్తున్నారు. ఈ ముఠాపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తాజాగా శంఖంతో అమ్మకానికి వస్తున్న ఈ ముఠాను నీలాద్రిగుడ అటవీ ప్రాంతంలో అంపానీ మార్గంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వారిలో రామ్‌చలన్, గోపాల్‌మజ్జి, కృష్ణ పంకా, అస్త మజ్జి, త్రిపుపతి బిందాని, ఉమేష్ ఉన్నారు. నాయకుడు బలరాం హరిజన్ పరారయ్యాడు. నిందితులంతా నబరంగ్‌పూర్ జిల్లా వాసులేనని ఏఎస్పీ ఆదిత్య సేన్ ప్రకటించారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించారు.
బంగారు శంఖం పేరిట టోకరా


