శ్రీముఖలింగంలో భక్తుల అవస్థలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం మాడవీధుల్లో రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. స్వామివారి మాడ వీధుల్లో ధాన్యం ఆరబోయడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేకుండాపోయింది. దీంతో ఆలయం ఎదురుగా రోడ్డుమీద వాహనాలు పార్కింగ్ చేయడంతో భక్తులు ఆలయానికి వెళ్లి వచ్చేందుకు అవస్థలు పడ్డారు. వాహనాలు నిలిపేందుకు గుత్తేదారుడు పార్కింగ్‌కు డబ్బులు కూడా వసూలు చేసి సరైన పార్కింగ్ స్థలం చూపకపోవడంతో ఇలా నిర్లక్ష్యంగా భక్తులు రోడ్డు మీదనే నిలిపివేశారు. దీనిపై దేవదాయ శాఖ అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.


