బాల కార్మికుడి గుర్తింపు
పర్లాకిమిడి: జిల్లాలో గుమ్మాబ్లాక్ సెరంగో బస్టాండ్‌లోని హోటల్‌లో బాలకార్మికుడిని అధికారులు గుర్తించి మంగళవారం సాయంత్రం పోలీసు అధికారుల సహయంతో పర్లాకిమిడి జిల్లా శిశు సురక్షా విభాగం తీసుకువచ్చారు. కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బాల కార్మికుడిని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, కౌన్సిలింగ్‌ను అధికారులు చేపట్టారు. పట్టుకున్న బాలకార్మికుడి వయస్సు 13 సంవంత్సరాలు, ఏడో తరగతి చదువుతూ మధ్యలో డ్రాపౌట్ అయ్యాడు. మరిన్ని వివరాలను జిల్లా శిశు సంక్షేమ సమితి అధికారులు సేకరిస్తున్నారు.
47 వినతుల స్వీకరణ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి మిలిత జన సునాని శిబిరం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 47 వినతులు స్వీకరించారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, ఎస్పీ రోహిత్ వర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో బుధవారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్టు టాటా పవర్ డిస్టిబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మంగళవారం తెలిపారు. 132/133 కేవీలైన్ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందు సరఫరాను నిలిపి వేస్తామని.. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆదిత్యలో అంతర్జాతీయ సదస్సు
టెక్కలి: సాంకేతిక అప్లికేషన్స్‌పై టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, టెక్ ఇన్నోవేషన్ తదితర విభాగాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంకేతిక రంగంలో పరిశోధనలు, విద్యార్థుల సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.


