రహగిరి ఉత్సవానికి సహకరించాలి
జయపురం: జయపురంలో ఈ నెల 14వ తేదీన మున్సిపాలిటీ వారు నిర్వహంచనున్న ‘రహగిరి’ ఉత్సవానికి సంబంధించి మున్సిపల్ సభాగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కళాకారులతో రహగిరి పదోత్సవం సర్దార్ వల్లభాయి రోడ్డులో(మైన్ రోడ్డు)నిర్వహించేందుకు నిర్ణయించినట్లు శొశ్యా రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిద ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల తరఫున 42 స్టాల్స్ ఏర్పాటు చేసి వస్తు ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. రహగిరి నిర్వహణలో పోలీసులు పూర్తి రక్షణ ఏర్పాట్లు చేపట్టడంతో పాటు డ్రోన్‌లతో పర్యవేక్షిస్తారన్నారు. పట్టణ కళాకారులను ఉత్సా పరచడంతోపాటు పట్టణ ప్రజల్లో సోదరభావం పెంపొందించటమే రహగిరి పదోత్సవ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ రహగిరి ఉత్సవానికి పట్టణ ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ సహాయ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, జయపురం సబ్‌డివిజన్ సమాచార, ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, సమాజ సేవి సంజయ జైన్, మున్సిపల్ స్టెనో గోపాల కృష్ణ సాహు, కౌన్సిలర్ విష్ణువర్దన్ రెడ్డి, నిరంజన్ పాణిగ్రహి, సత్యనారాయణ పాత్రో, సంజయ మార్త, జగదీష్ రావు, తదితరులు పాల్గొన్నారు.


