ఉత్సాహంగా హాకీ, ఫుట్‌బాల్ పోటీలు
రాయగడ: బిజూ కన్యా రత్న యోజన పథకంలో భాగంగా బేటీ బచావో –బేటీ పడావో అభిజాన్ కింద బాలికల సాధికారత కోసం రాయగడ జిల్లా బాలికల సంరక్షణ విభాగం మంగళవారం హాకీ, ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా జిల్లా గ్రామీణ సమగ్రాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్ర కాంత్ మాఝ, జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్, డీసీపీవో మహాదేవ్ చిచువాన్ తదితరులు పాల్గొన్నారు. పొటీల్లో బాలికలు, డీపీపీయూ సహచరులు, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ విభాగంలో పీఎంసీ జగదాంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ సెంటర్‌కు చెందిన బాలికలు విజయం సాధించగా.. హాకీ పోటీల్లో రాయగడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.


