చేనేత కార్మికుల నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్: కుటీర పరిశ్రమగా ఉన్న చేనేతపరిశ్రమను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్య లను విరమించుకోవాలని అలికాం, పరిసర గ్రామాల చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర చేనేత కార్మిక సంస్థ డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్‌లు కలిసి కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను గ్రామంలోకి తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు సహకరించాలని కోరడంలో అర్ధం లేదన్నారు. ఇక్కడి మాస్టర్ వీవర్లు నేసిన చీరలకు దేశ విదేశాల్లో గుర్తింపు ఉందని, ఇంతటి నైపుణ్యం కలిగిన నేత సంస్కృతిని కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు తాము సానుకూలంగా లేమని స్పష్టం చేశారు. గ్రామానికి సంబంధం లేని ఓ కార్పొరేట్ సంస్థకు ఐదు ఎకరాల భూమి కేటాయించడం తగదన్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌లకు వినతిపత్రాలు అందజేశారు.


