వార్షికోత్సవ వైభవం
రాయగడ:
సాహిత్యం, కళారంగాలు ముందుకు సాగాలంటే యువత ఆసక్తి కనబరచాలని ప్రముఖ కవి, రచయిత విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కేజీ వేణు అన్నారు. స్థానిక సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవం కోదండ రామమందిరంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రవాసంలో ఒక తెలుగు సంస్థ ఏర్పాటు చేసి నిరాటకంగా 30 వసంతాలు నడపడం అంటే సామాన్య విషయం కాదని అన్నారు. ఈ సందర్భంగా తల్లి, తండ్రి, గురువు పై వినిపించిన స్వీయ కవితలు అబ్బుర పరిచాయి. స్పందన నృత్య పాఠశాల చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. పట్టణంలో ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నాయని, అయితే స్పందన వంటి సాహితీ, సాంస్కృతిక సంస్థ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని గుర్తింపు తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయమని రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్ అన్నారు. తాను కూడా నటుడినేనని తెలిపారు. 30 ఏళ్ల కిందట ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు స్వర్గీయ జీఆర్‌ఎన్ ఠాగూర్ ద్వారా ఆవిర్భవించిన స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించిందని ఆ సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరీశంకర్ ప్రసాద్ అన్నారు. ఆయన అనంతరం న్యాయవాది స్వర్గీయ మాధవ రావు కుముంధాన్ చేతుల మీదుగా ఇన్నాళ్లు ఈ సంస్థ నడిచిందని, ఆయన తరువాత తనకు ఈ సంస్థలో స్థానం లభించడం గర్వంగా ఉందన్నారు. స్పందన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న నృత్య పాఠశాల కేవలం ఐదుగురితో మొదలైందని, ఇప్పుడు యాభై మంది ఉన్నారని తెలిపారు. అంతకు ముందు సంస్థ కార్యదర్శి డాక్టర్ తులసీ దాస్ మాట్లాడుతూ స్పందన వార్షిక నివేదికను చదివి వినిపించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థకు చెందిన నృత్య పాఠశాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సందన సంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి సభ్యులుగా క్రియాశీల పాత్ర పొషిస్తున్న పిల్లల శంకరరావు, కవి ,రచయిత భళ్లమూడి నాగరాజు, డాక్టర్ తులసీ దాస్ తదితరులను సంస్థ ఘనంగా సన్మానించింది.
వార్షికోత్సవ వైభవం
వార్షికోత్సవ వైభవం
వార్షికోత్సవ వైభవం
వార్షికోత్సవ వైభవం
వార్షికోత్సవ వైభవం
వార్షికోత్సవ వైభవం
వార్షికోత్సవ వైభవం


