అంబులెన్స్‌కు ప్రమాదం
రాయగడ: కొరాపుట్–రాయగడ ప్రధాన రహదారి కొట్లాగుడ వద్ద జననీ ఎక్స్‌ప్రెస్ ఆంబులెన్స్ ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆంబులెన్స్ ముందు టైర్లు పేలిపొవడంతో అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించి తిరిగి వస్తుండగా సదరు సమితి కొట్లాగుడ గ్రామ సమీపంలో టైర్లు పేలిపొవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న కారును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అత్యంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి దిగజారాయి. సోమవారం కొరాపుట్ జిల్లా దమంజోడిలో భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) టౌన్ షిప్ సమీపంలో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే కనిష్టం కావడం విశేషం. దేవమాలి, తొలమాలి, పుట్‌షీల్, పుంజషీల్, గుప్తేశ్వరం, డుడుమ, రాణి డుడుమ, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరిగింది.
ఎన్‌సీఆర్టీలో శిక్షణకు జిల్లా ఉపాధ్యాయులు
పర్లాకిమిడి: నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ–2020)లో భాగంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు ఉపాఽధ్యాయులు (ఎన్‌సీఆర్టీ) రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్వహించే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సు ట్రైనింగ్ ఎంపికయ్యారు. వారిలో గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ జీబ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైన్ టీచర్ రామక్రిష్ణ బొమ్మాళీ, మోహానాకు చెందిన శివరాం మండళ్, జాజ్‌పూర్ జిల్లాకు చెందిన శుభ్రాంశు నాయక్, హెచ్.ఎస్.రామక్రిష్ణ (జాజ్‌పూర్ జిల్లా) బెల్లగ ఉపాధ్యాయులు నవంబర్ 26 నుంచి డిసెంబర్ పదో తేదీ వరకూ శిక్షణ పొందుతున్న సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాలు వారిని అభినందించారు.
9 ఎకరాల వరి కుప్పలు దగ్ధం
కొరాపుట్: ఆరుగాలం రైతు సాగు చేసుకున్న తొమ్మిది ఎకరాల వరికుప్పలు అగ్నికి ఆహుతైంది. ధాన్యంతోపాటు ట్రాక్టర్ కూడా బూడిదైంది. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి దుంగియాడిగి గ్రామంలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. అన్నదమ్ములైన గాంధీరాం గొండో, బాబుదాస్ గొండో, రోహిత్ గొండోకి చెందిన వరి పంట కోసి ట్రాక్టర్‌లో తరలించడానికి సిద్దం చేశారు. ఇదే సమయంలో అనుకొని విధంగా అగ్ని మంటల రేగాయి. ఇదే ప్రమాదంలో వరిని తరలించడానికి సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్ కూడా దగ్ధమైంది. కేవలం ఖరీఫ్ పంట మీదే ఆధారపడిన బాధిత రైతులు ఏడాది కష్టం మట్టిలో కలసి పోయిందని రోదిస్తున్నారు.
అంబులెన్స్‌కు ప్రమాదం
అంబులెన్స్‌కు ప్రమాదం
అంబులెన్స్‌కు ప్రమాదం


