ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన
జయపురం: జాతీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 సందర్భంగా స్థానిక విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌స్ కళాశాలలో స్వర్గీయ సింహాద్రి మహరాణ భవనంలో జిల్లా స్థాయి చిత్ర కళా ప్రదర్శణ సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన జిల్లా స్థాయి చిత్రకళా పోటీల్లో విద్యార్థులు వేసిన చిత్రాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం వారంతా ఫొటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ఫొటోలు తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రదర్శనలో జయపురం సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి, కొరాపుట్ జిల్లా ప్రణాళిక బోర్డు అధికారి, జిల్లా సాంస్కృతిక అధికారి సూర్యకాంత బెహర, జయపురం మున్సిపాలిటీ సహాయ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ ప్రసంగించారు.
ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన
ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన


