గ్రీవెన్స్‌లో 69 వినతుల స్వీకరణ
పర్లాకిమిడి:
జిల్లాలో నువాగడ బ్లాక్ కె.జలార్‌సింగ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్సుసెల్, గ్రామ ముఖిపరిపాలనకు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీవెన్స్‌సెల్‌కు ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్ విచ్చేశారు. సమితిలో బోడోపద, తిత్తిసింగి, ఖోజురిపద గ్రామపంచాయతీల నుంచి 69 వినతులు అందాయి. వాటిలో గ్రామ సమస్యలు 35, వ్యక్తిగత అభియోగాలు 34 ఉన్నాయి. ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ వినతులు పరిశీలించి సంబంధిత విభాగాల అధికారులకు అందజేశారు. అనంతరం ఐసీడీఎస్ విభాగం ఏర్పాటు చేసిన పోషక ఆహారాల స్టాల్‌ను సందర్శించారు. బీడీవో లోకనాథ ప్రధాన్, తహసీల్దార్ మోనాలిసా ఆచారి, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


