సీనియర్ సిటిజన్ జాతీయ అథ్లెటిక్స్‌లో పతకాలు
పర్లాకిమిడి: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టేడియంలో ఈనెల 7న జరిగిన ఏడో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2025 పోటీలలో పర్లాకిమిడికి చెందిన సీనియర్ క్రీడాకారుడు, విశ్రాంత ఎకై ్సజు ఎస్‌ఐ కిశోర్‌చంద్ర రథ్‌కు రెండు పతకాలు లభించాయి. వందమీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్, ట్రిపుల్ జంప్ లో సిల్వర్ మెడల్ సాధించినట్టు ఆయన తెలిపారు. ఆయన విజయానికి పర్లాకిమిడి సీనియర్ సిటిజన్ ఫోరం, ధర్మ నారాయణ మెడికల్ పైడిశెట్టి లక్ష్మణరావులు అభినందించారు. ఈ పోటీలకు ఒడిశా నుంచి 12 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. గతంతో కిషోర్ చంద్ర రథ్ పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలో అనేక బహుమతులు సాధించారు.
సీనియర్ సిటిజన్ జాతీయ అథ్లెటిక్స్‌లో పతకాలు


