147 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని మునిగుడలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి కలెక్టర్ అశుతోష్ కులకర్ణి హాజరయ్యారు. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 147 వినతులను స్వీకరించారు. ఇందులో 109 వ్యక్తిగత సమస్యలు, 38 గ్రామ సమ్యలుగా గుర్తించారు. ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.95 వేల సహాయాన్ని అందించారు. ముగ్గురుకి రెడ్ క్రాస్ నిధి నుంచి రూ.25 వేల సహయాన్ని అందజేశారు. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని, పలువురు అధికారులు హాజరయ్యారు.
సైబర్ మోసాలపై అప్రమత్తం
రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో సైబర్ మోసాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్‌ఐసీ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ మిథేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆన్‌లైన్ యుగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డబ్బులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. తెలియని నంబర్లను రిసీవ్ చేసుకోవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతుందన్నారు. అనసవరమైన యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం వంటివాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
147 వినతుల స్వీకరణ


