దివ్యాంగులకు చేయూత
భువనేశ్వర్: దివ్యాంగుల సంక్షేమం, ప్రోత్సాహానికి హైటెక్ చేయూతనిచ్చి ఆదుకుంటుందని హైటెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి ప్రకటించారు. స్థానిక బిపిన్ బిహారీ చౌదరి స్కూల్ డెఫ్ ఆట స్థలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ మహోత్సవం– 2025లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో జట్నీ ప్రాంతానికి చెందిన మో పొరిబార్ తదితర సాంఘిక సంక్షేమ సంస్థల ప్రతినిథులకు ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. హృదయపూర్వక ఆదరణతో దివ్యాంగులు దివ్యంగా వెలుగొందే అవకాశం మెండుగా ఉంటుందని సత్కార గ్రహీతలు తెలిపారు. కుటుంబం, సమాజం దివ్యాంగుల పట్ల ప్రోత్సాహకరంగా ఆదుకుని ఎదుగుదలకు దోహదపడాలని డాక్టరు తిరుపతి పాణిగ్రాహి అన్నారు. హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది.


