బీఎస్‌ఎఫ్ మారథాన్
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఉత్సాహంగా..
జయపురం: భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 61 వ ప్రతిష్టాపన దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎఫ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆదివారం బీఎస్‌ఎఫ్ కొరాపుట్ 180 వ బెటాలియన్ జయపురంలో బీఎస్‌ఎఫ్ రన్ పేరుతో మారథాన్ పరుగు పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పట్టణంలోని విద్యార్థులు పాల్గొన్నారు. జయపురం విక్రమ్ విశ్వవిద్యాలయ క్రీడా మైదానానికి ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. పది కిలోమీటర్ల పోటీలో మొదటి ముగ్గురు విజేతలకు రూ.15వేలు, రూ.10వేలు, రూ. 5వేలు చొప్పున అందజేశారు. ఐదు కిలోమీటర్ల పోటీలోనూ నగదు బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రధాన ఉత్సవంలో కొరాపుట్ బీఎస్‌ఎఫ్ 180 సెక్టర్ డీఐజీ సత్యవాద కాంచి ప్రసంగిస్తూ 1965 లో భారత్– పాకిస్థాన యుద్ధం జరిగిన తరువాత బీఎస్‌ఎఫ్ ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. 10 కిలోమీటర్ల మారథాన్‌లో ప్రథమ బహుమతి అశోక్ దండసేన, ద్వితీయ బహుమతిని రశ్మి రంజన్, మూడో బహుమతిని పవన్ కుమార్ యాదవ్ గెలుచుకున్నారని, బాలికల గ్రూపులో ప్రథమ స్థానం సుశ్మిత టిగ్గ, ద్వితీయ స్థానం దయామణి హరిజన్, తృతీయ స్థానం అంజళీ తడింగి పొందారని వెల్లడించారు. 5 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీల్లో దయానిధి ముండ ప్రథమ స్థానం పొందగా, దలమణి చిగున్ ద్వితీయ స్థానం, రవి ముదులి తృతీయ స్థానం పొందారు. విద్యార్థినుల్లో అంజన గొరడ ప్రథమ స్థానం, చాందిణి బీసీ నాయిక్ ద్వితీయ స్థానం, పూర్ణి మల్లిక్ తృతీయ స్థానం పొందారని తెలిపారు.
బీఎస్‌ఎఫ్ మారథాన్
బీఎస్‌ఎఫ్ మారథాన్


