చొయితీ ఉత్సవాలు
ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టేలా
● రామనగుడ సమితి చైర్మన్
రబి నారాయణ గొమాంగో
రాయగడ: అవిభక్త కొరాపుట్ జిల్లాలో అత్యధిక శాతం మంది నివసిస్తున్న ఆదివాసీ, హరిజనుల సంస్కృతికి అద్దం పట్టేవే లోకమహోత్సవ ఉత్సవాలని రామనగుడ సమితి చైర్మన్ రబి నారాయణ గొమాంగో అన్నారు. సమితి స్థాయి చొయితీ ఉత్సవాలు రామనగుడలో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నవరంగపూర్, కొరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాల్లో లోక్‌మహోత్సవాలు విభిన్న పేర్లతో నిర్వహిస్తున్నారని అన్నారు. రాయగడలో జరిగే ఉత్సవాలకు చొయితీగా నామకరణం చేసి ఉత్సవాలను ప్రతీ ఏడాది నిర్వహించి ఆదివాసీ, హరిజన ప్రజల భాష, సంస్కృతి, వారి కళలను పరిరక్షించేందుకు ఎంతో ప్రయాసపడుతుండటం అభినందనీయమన్నారు. అనంతరం సమితి కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు కొనసాగి వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు కలశలతో తీసుకువచ్చిన శుద్ధజలాలను ఊరేగింపుగా వేదికవద్దకు తీసుకువెళ్లారు. ర్యాలీలో ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో, ఆటపాటలతో, నృత్యాలతో పాల్గొని ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. తహసీల్దార్ ప్రాణక్రిష్ణ మహాపాత్రో, రామనగుడ సమితి సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
చొయితీ ఉత్సవాలు
చొయితీ ఉత్సవాలు


