మౌలిక సౌకర్యాలు కల్పించాలని వినతి
రాయగడ: సమస్యలతో సతమతమవుతున్న తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ పరిధి గొరఖ్‌పూర్ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. సమస్యల గురించి పట్టించుకోకపొతే తామంతా కలిసి ఈ నెల ఎనిమిదో తేదీన రాస్తారోకో చేపడతామని వినతిపత్రంలొ పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామంలో మంచినీరు, రహదారి, మోబైల్ టవర్ వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఈ సమస్యలకు సంబంధించి పలుసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై న తమ సమస్యలు పరిష్కరించకపొతే ఆందోళన చేపట్టడం తప్పదని హెచ్చరించారు.
వివాహిత ఆత్మహత్య
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కుచేయచిపొదొరి పంచాయతీలోని కంపర గ్రామానికి చెందిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సమా చారం తెలుసుకున్న దొరాగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కాసీపూర ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కంపర గ్రామానికి చెందిన యోజేష్ ఖొసల భార్య అనీషా ఖొర ఇంట్లోని ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గది తలుపులు మూసి వేసి ఉండటంతో అనుమానించిన కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లి చూసేసరికి వేలాడుతూ అనీషా కనిపించడంతో కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు, బైకు ఢీ
● ఇద్దరికి తీవ్ర గాయాలు
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి చిన్న కుజేంద్రీ సమీపంలో కారు, బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు తగిలిన వారిలో చిన్న కుజేంద్రీ గ్రామానికి చెందిన సిధు పతిక, గిరిధర్ గొమాంగోలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం బరంపురం తరలించారు. ఇదిలాఉండగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పగాయాలలో బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా బైకు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అపూర్వ కలయిక..
పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో 1986 విద్యా సంవత్సరం పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయకలయికను ఏర్పా టు చేసుకున్నారు. దీనికి రాయఘడ బ్లాక్ గండాహాతి జలపాత ప్రాంతం వేదికై ంది. ఈ సందర్భంగా చదువుకున్న రోజులను పూర్వవిద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రూపుఫొటోలు తీసుకొని మురిసిపోయారు. క్విజ్, డ్యాన్స్ పోటీలు నిర్వహించి ఆనందంగా గడిపారు. కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, కులవర్థనరావు, ప్రిన్సిపాల్ బినోదినీ, సైన్స్ కళాశాలకు చెందిన మనోజ్‌పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సౌకర్యాలు కల్పించాలని వినతి
మౌలిక సౌకర్యాలు కల్పించాలని వినతి


