● ఉత్సాహంగా కవి సమ్మేళనం
● ఆలోచింపజేసిన కవితలు
రాయగడ: సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకుని కవులు, రచయితలు రచించిన కవితలు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయని ప్రముఖ రచయిత్రి, రాయగడలోని అటానమస్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు టి.జ్యోతి అన్నారు. స్వాగత్ లైన్‌లోని శ్రీకోదండ రామ మందిరం ప్రాంగణంలోని సమావేశం హాల్‌లో ఆదివారం స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కవి సమ్మేళన కార్యక్రమం సంస్థ సాహితీ విభాగం కార్యదర్శి సింగిడి రామారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ.. కవితల్లో ఆవేదన, ఆలోచన, వర్ణన, అభ్యుదయ భావాలు, తల్లిదండ్రులపై ఉన్న ప్రేమతో పాటు 30 వసంతాల స్పందనను వర్ణిస్తు అనుభవాలు రంగరించి రాసినవిగా ఉన్నాయని ఆభిప్రాయపడ్డారు. సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరీశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. స్పందన సంస్థ ఆవిర్భవించిన అనంతరం కవులకు, రచయితలకు ఎంతో ప్రోత్సాహం లభించిందని అన్నారు. అనంతనం అతను రచించిన స్వీయ కవితను చదివి వినిపించారు. కవులు గణపతిరావు, భళ్లమూడి నాగరాజు, బాలక్రిష్ణ పట్నాయక్, కేకేఎం పట్నాయక్, కిశోర్‌కుమార్, భళ్లమూడి నాగేశ్వరరావు, తాళ్లపూడి గౌరీ, పీఎంజీ శంకరరావు, చిన్నారి చక్రధర్, డాక్టర్ బాబూరావు మహాంతి, సింగిడి రామారావు, విశాఖపట్నం నుంచి వచ్చిన లహరి పత్రిక సంపాదకులు బలిజేపల్లి గౌరీజెన్న, పిల్లల శంకరరావు, తెలుగు అధ్యాపకుడు భాస్కరచంద్ర గుప్తా తదితరులు స్వియ కవితలు చదివి వినిపించారు. కవులను, ముఖ్యఅతిథి జ్యోతిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. విశ్రాంత అధ్యాపకుడు గిరీష్ పట్నాయక్ ప్రార్థన గీతం ఆలపించగా, సాహితీ విభాగం కార్యదర్శి సింగిడి రామారావు సమావేశాన్ని పరివేక్షించారు. అధికసంఖ్యలో సాహితీ అభిమానులు హాజరయ్యారు.
● ఉత్సాహంగా కవి సమ్మేళనం
● ఉత్సాహంగా కవి సమ్మేళనం


