సందడిగా పథ్ ఉత్సవాలు
● మల్కన్‌గిరిలో ఆధ్యాత్మిక
వాతావరణం
మల్కన్‌గిరి: మాల్యవంత్ మహోత్సవాన్ని మరింత ఉత్సవంగా మార్చేందుకు మల్కన్‌గిరిలో పథ్ ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చల్లని ఉదయం వేళ నగరమంతా నృత్యం, గానం, ఉల్లాసంతో సదడి చేసింది. ముందున్న మాల్యవంత్ మహోత్సవానికి ముందుగా పట్టణంలో ఈ పథ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ ప్రారంభించగా.. కలెక్టర్ కార్యాలయం నుంచి డీఎన్‌కే క్రీడా మైదానం వరకూ సాగింది. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి తంగులు, ఆదనపు కలెక్టర్ సోమనాథ ప్రదాన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేదబర్ ప్రధాన్, జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి, కార్యనిర్వాహక అధికారి నరేష్ చంద్ర శబర్, ఉప కలెక్టర్ అశ్ని ఏఎల్, అటవీ విభాగం అధికారి సాయికిరణ్, బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రవిమిశ్రా తదతరులు హాజరయ్యారు. నగరవాసులు పథోత్సవాన్ని ఆనందంగా ఆస్వాదించారు. అనంతరం రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలతో యువత ఉత్సాహాంగా నృత్యాలు చేశారు. వేదికపై గిరిజన కళా సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పథ్ ఉత్సవంలో నృత్యం, గానం, స్కేటింగ్, ఫాస్ట్‌ఫుడ్స్, రంగవల్లులు, యోగా వివిధ క్రీడా ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ రంగుల ముగ్గులు, చిత్రలేఖనం ప్రత్యేక ఆకర్షణనగా నిలిచాయి. పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. బోర్డర్ సెక్యూరిటీ దళం నిర్వహించిన డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పథ ఉత్సవాలలో పోలీసు శాఖ ‘ఆర్జీ జుంకార్’బృందం మెలోడి ప్రదర్శన ఆకట్టుకున్నాయి.
సందడిగా పథ్ ఉత్సవాలు
సందడిగా పథ్ ఉత్సవాలు
సందడిగా పథ్ ఉత్సవాలు


