పుణ్యక్షేత్రాల సందర్శనలో హైకోర్టు జడ్జి
శ్రీకాకుళం/గార/శ్రీముఖలింగం: ఆంధప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ కుటుంబసమేతంగా ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథస్వామి, శ్రీముఖలింగంలోని మధుకేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయకంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అనురాగ్, బి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కంచిలి: బూరగాం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్ పూర్ణమహి ఠాకూర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కంచిలి ఎస్‌ఐ పి.పారినాయడు స్థానిక విలేకర్లకు ఆదివారం వివరాలు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల లోడ్‌తో ఇచ్ఛాపురం వైపు నుంచి పలాస వైపు వస్తున్న ఠాకూర్ బూరగాం వద్ద ఆగాడు. బహిర్భూమికి కోసం రోడ్డు దాటుతుండగా మరో లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఠాకూర్ తలకు బలమైన గాయం కావడంతో సోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పశువులు పట్టివేత
రణస్థలం : జె.ఆర్.పురం రామతీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు తరలిస్తున్న పశువులను పట్టుకుని గుర్ల మండలం గుజ్జింగివలస గోశాలకు తరలించారు. ఇద్దరు నిందితులపై జె.ఆర్.పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు.
బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు
సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎకై ్సజ్ సీఐ రమణ హెచ్చరించారు. ‘బెల్టు తీెసేదెప్పుడో’ శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి స్పందించి కొర్లాం జాతీయ రహదారి వద్ద పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఏడు మద్యం సీసాలతో పట్టుబడిన పుణ్యవతిపై కేసు నమోదు చేశారు. దాబాల్లో మద్యం సేవించేందుకు అనుమతించే నిర్వాహకులు, అనదికార మద్యం దుకాణాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డాబాలు వద్ద మద్యం అనుమతి లేదు అనే బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
రణస్థలం: జీరుపాలెంలో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మైలపల్లి కోర్లమ్మ, చిలకమ్మకు చెందిన రెండు పూరిళ్లు కాలిపోయాయి. ముందుగా కోర్లమ్మ ఇంట్లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చిలకమ్మ ఇంటికి అంటుకున్నాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అప్పటికే గృహోపకరణాలు కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షలు 60 వేలు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని జీరుపాలెం సర్పంచ్ మాగుపల్లి రాముడు కోరారు. రణస్థలం అగ్నిమాపక అధికారులు ఇళ్లను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ యాళ్ల పోలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులకు అనుగుణంగా అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు. వివరాలకు మెడికల్ బయోటెక్నాలజీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.ప్రదీప్(8985745820), ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.రామకృష్ణ (9030768474)ను సంప్రదించాలని కోరారు.
పుణ్యక్షేత్రాల సందర్శనలో హైకోర్టు జడ్జి
పుణ్యక్షేత్రాల సందర్శనలో హైకోర్టు జడ్జి


