లారీ ఢీకొని ఇద్దరికి గాయాలు
పలాస: శాసనాం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. రాయగడకు చెందిన సవర సునీల్‌కుమార్ స్నేహితుడు ఈశ్వరరావుతో కలిసి బైకుపై బరంపురం వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు.
ఘనంగా ఆరుద్ర నక్షత్ర పూజలు
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడి వీధిలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ, అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారిని విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. నక్కవీధిలోని ఉమాజఠలేశ్వరస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అశ్వినీకుమార్, మహేష్ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు జరిగాయి.
లారీ ఢీకొని ఇద్దరికి గాయాలు


