ఆదిత్యాలయంలో భక్తుల రద్దీ
శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 10 నుంచి భక్తుల తాకిడి పెరిగిపోవడంతో ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ మంచినీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.5,57,100, విరాళాలు, ప్రత్యేక పూజల టికెట్ల విక్రయాల ద్వారా రూ.550,925, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.270 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో వెల్లడించారు. కాగా, స్వామివారిని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ దర్శించుకున్నారు


