గ్రాడ్యుయేట్లు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి: గవర్నర్
భువనేశ్వర్: ఉన్నత విద్య ఉత్తీర్ణులుగా గ్రాడ్యుయేట్లు ఉద్యోగ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పిలుపునిచ్చారు. రౌర్కెలాలోని బిజూ పట్నాయక్ సాంకేతిక విశ్వవిద్యాలయం (బీపీయూటీ) 12వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్, పునరుత్పాదక శక్తి, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ప్రపంచం వేగంగా పునర్నిర్మాణ వేగం పెంచుతోందని, ఈ పరివర్తనలో భాగంగా డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి చొరవలతో భారత దేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
ప్రపంచంలో 3వ అతి పెద్ద స్టార్ట్ అప్ పర్యావరణ వ్యవస్థగా వెలుగొందుతోందని, క్లీన్ ఎనర్జీ, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అంతరిక్ష పరిశోధన రంగాల్లో భారతీయ యువత సవాళ్లు, అడ్డంకులను అధిగమించాలని గవర్నర్ ప్రోత్సహించారు. ఈ దిశలో బీపీయూటీ ఆవిష్కరణ, వ్యవస్థాపకత స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. గ్రాడ్యుయేట్లు, వారి కుటుంబాలను అభినందిస్తూ నేడు మానవాళి, పర్యావరణ సంరక్షణకు పాటు పడాలన్నారు. బెంగళూరులోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) మాజీ డైరెక్టర్, బెంగళూరు జైన్ విశ్వవిద్యాలయం గౌరవ ప్రొఫెసర్ మరియు సలహాదారు (మెకానికల్ ఇంజనీరింగ్ – ఫోరెన్సిక్ మెటీరియల్స్) ప్రొఫెసర్ ఎస్. సి. శర్మ, బీపీయూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అమియ కుమార్ రథ్ స్నాతకోత్సవంలో ప్రసంగించారు.
గ్రాడ్యుయేట్లు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి: గవర్నర్
గ్రాడ్యుయేట్లు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి: గవర్నర్


