జై ఢొలొకియా నువాపడా అభివృద్ధి రథసారధి: ముఖ్యమంత్రి
భువనేశ్వర్: నువాపపడా ఉప ఎన్నికలో నిర్ణయాత్మక విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జై ఢొలొకియా స్థానిక రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిశారు. ఈ సందర్భంగా విజయోత్సవ సభలో కొత్త ఎమ్మెల్యేను ముఖ్యమంత్రితో పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. తన తల్లితో కలిసి వచ్చిన జై ఢొలొకియాకు పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్ మరియు ఇతర ఎమ్మెల్యేలు సాదరంగా స్వాగతం పలికారు. 83,000 పైబడిన ఓట్లతో విజయం సాధించి జై ఢొలొకియా అఖండ విజేతగా నిలిచారని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందనలు తెలిపారు. బీజేపీ అభివృద్ధి ప్రణాళికపై ప్రజల విశ్వాసం, పార్టీ కార్యకర్తల కృషి ఈ ఘన విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. నువాపడా జిల్లాలో అభివృద్ధిని నడిపించడానికి జై ఢొలొకియా రథసారథి అని ప్రోత్సహించారు. ఈ విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించిన మన్మోహన్ సామల్ ఇది ఒడిశా రాజకీయ దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుందన్నారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి నాయకత్వం, పార్టీ అవిశ్రాంత కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జై ఢొలొకియా తన విజయాన్ని నువాపడా ప్రజలకు, తన తండ్రి రాజేంద్ర ఢొలొకియాకు అంకితం చేసినట్లు ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మంత్రి నిత్యానంద్ గోండ్, ఎమ్మెల్యే బాబూ సింగ్, భువనేశ్వర్ జిల్లా సంస్థాగత అధ్యక్షుడు నిరంజన్ మిశ్రా, నువాపడా జిల్లా అధ్యక్షుడు కమలేష్ దీక్షిత్, దివంగత రాజేంద్ర ఢొలొకియా సతీమణి సిమల్ ఢొలొకియా తదితరులు పాల్గొన్నారు.
జై ఢొలొకియా నువాపడా అభివృద్ధి రథసారధి: ముఖ్యమంత్రి


