నందపూర్ సమితిలో షూటింగ్ సందడి
జయపురం: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి రాణి డుడమ ప్రాంతంలో కమ్మెట్ కళ్యాణ్ తెలుగు సినిమా షూటింగ్ జరుగుతున్నది. డాన్స్ మాస్టర్ శేఖర్‌ను అఖిల భారత చిరంజీవి యువత, ఒడిశా రాష్ట్ర అధ్యక్షులు, కళాకారుడు వై.శ్రీనివాస ఖన్నా నేతృత్వంలో జయపురం చిరంజీవి యువత, చిరంజీవి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సెమిలిగుడ చిరంజీవి ఫాన్స్ అధ్యక్షులు సంతోష్ కుమార్ చౌధురి, కార్యదర్శి సురేష్ కుమార్‌లు పాల్గొన్నారు. అనంతరం కమ్మెట్ కళ్యాణ్ సినిమా నిర్మాతలు కోన వెంకటరావు, కిట్టు వెంకటేష్, డైరెక్టర్ జాగర్లపూడి జానకీరామ్, హీరో శ్రీవిష్ణు మొదలగు నటులను సాకేతిక బృందాన్ని కలసి కొరాపుట్ జిల్లాలో అందమైన ప్రకృతి అందాల మధ్య సినిమాలు తీయటం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస ఖన్నా మాట్లాడుతూ.. కొరాపుట్ జిల్లాలో తెలుగు సినిమాలు తీయటం వలన జిల్లాలో ఔత్సాహిక కళాకారులకు సినిమాలో నటించే అవకాశం లభిస్తుందని అన్నారు. కమ్మెట్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం కొంతమందికి కల్పించారని వెల్లడించారు.
నందపూర్ సమితిలో షూటింగ్ సందడి


