పుస్తకావిష్కరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కవులు, రచయితలు, కళాకారులకు కోదవలేదని, ప్రతిఏటా అవిశ్రాంతంగా తహసీల్దార్ అనేక రచనలు రాసి ఒడియా ప్రజలకు అందిస్తున్నారని రెవెన్యూ డివిజనల్ కమిషనర్ సంగ్రాం కేసరి మహాపాత్రో అన్నారు. ఉత్కళ సమాజ్ అధ్యక్షుడు, రచయిత పూర్ణచంద్ర మహపాత్రో రాసిన ‘పరాలారో పరిలాపిల్లా’ అనే కథాసంపుటి మనసుకు హత్తుకున్నట్టు రచించారని దక్షిణమండళం రెవెన్యూ డివిజనల్ కమిషనరు సంగ్రాం కేసరి మహాపాత్రో అన్నారు. ఆయన స్థానిక రాజవీధిలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో సిద్ధాంత పుస్తకావిష్కరణ ఉత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అతిథులుగా సంస్కృత మహావిద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ అన్నపూర్ణాదేవి, డాక్టర్ బిజయానంద సింగ్, డాక్టర్ రింజిత్‌కుమార్ పండా, బిచిత్రానంద బెబర్తా తదితరులు హాజరయ్యారు. అతిథులను శ్వేతా పట్నాయక్ ఆహ్వానించగా, మహిళా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ కళ్యాణి మిశ్రా, రాజేశ్వరీ పాత్రోలు సిధ్ధాంత సాహితీ సంస్థ పరిచయాన్ని తెలిపారు. అనంతరం శంకర్‌సాహు రచించిన ‘అన్యోఏకో పాయిక్ బిరోధ్’ ఉపాంత ప్రహరీ పూర్ణచంద్ర మహాపాత్రో రచించిన పరాలారో పరిలా పిల్లా.. అనే రెండు పుస్తకాలను ముఖ్యఅతిథి ఆర్‌డీసీ సంగ్రాం కేసరి మహపాత్రో ఆవిష్కరించారు. పలువురు ఈ పుస్తకాల వైశిష్ట్యాన్ని వర్ణించడం జరిగింది.
బీజేపీ శ్రేణుల సంబరాలు
పర్లాకిమిడి: నువాపడ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జయడోల్కియా ఘన విజయం సాధించడం పట్ల గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు పర్లాకిమడిలో విజయోత్సవాలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో ఆధ్వర్యంలో రాయఘడ బ్లాక్‌లో ఉదయం సంబరాలు చేపట్టారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్‌కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం బీజేపీ విజయోత్సవ సభలో పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణ
పుస్తకావిష్కరణ


