జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషి చేస్తోందని వివిధ ఉద్యోగ, పౌర సంఘాల ప్రతినిధులు కొనియాడారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షత బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సదాశివుని కృష్ణ, జి.లక్ష్మణరావు, జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నేతలు బొడ్డేపల్లి ప్రసాదరావు, ఎస్.జోగినాయుడు, జి.షణ్ముఖరావు, డోల శంకరావు, డోల అప్పన్న, సీహెచ్ నాగభూషణ్, టెంక శ్రీను, రౌతు సూర్యనారాయణ, భేరి చిన్నారావు, జి.నర్సింగరావు, గంగు మన్మథరావు, బాసూరు సాయి, డి.నందికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


