కూర్మనాథాలయంలో నీటి లీకులపై పరిశీలన
గార: ఆది కూర్మక్షేత్రంలోని రాతికట్టడం నుంచి లక్ష్మీసన్నిధి వద్ద వర్షపు నీరు లీకువుతుండటం వంటి సమస్యలపై రాష్ట్ర పురావస్తు శాఖాధికారి డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, పలువురు అధికారులు బుధవారం సందర్శించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి ఈ ఏడాది పర్యటన సమయంలో స్థానిక అర్చకులు, భక్తులు తెలిపిన సమస్యల్లో నీటి లీకులపై చెప్పడంతో అధికారులు పర్యటన చేపట్టారు. రాతికట్టడాలు మరమ్మతులు చేసేందుకు సాధ్యాసాద్యాలపై పరిశీలించారు. రాళ్ల మధ్య ఏర్పడిన ఖాళీలు పూడ్చేందుకు నిపుణులతో చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నివేదికను అందజేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు, సహాయ సంచాలకులు ఎస్.వెంకటరావు, ఏడీ ఇంజినీరింగ్ భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.


