గంజాయి కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్టు
రణస్థలం: విజయవాడలోని ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను జేఆర్‌పురం పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ చిరంజీవిలు వివరాలు వెల్లడించారు. పైడిభీమవరం భూమాత టౌన్‌షిప్ వద్ద 22.5 కేజీల గంజాయితో 10 మంది నిందితులను ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన పట్టుకోవడం జరిగిందన్నారు. అరైస్టెన కొప్పెర్ల గ్రామానికి చెందిన ఇనాకోటి ముకుందను విచారించగా.. అతని వద్ద నుంచి యూనివర్సిటీలో చదువుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ నఫీజ్, గుంటూరు జిల్లాకు చెందిన కమ్మిశెట్టి వినోధ్ కుమార్‌లు గంజాయి కొనుగోలు చేస్తుంటారని తెలిసింది. వీళ్లు గంజాయి సేవించి అనంతరం యూనివర్సిటీలో గంజాయికి అలవాటుపడ్డ విద్యార్థులకు అమ్ముంతుంటారని పేర్కొన్నారు. దీంతో విజయవాడ వెళ్లి మూడు రోజులు నిఘా వేసి ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.


