
మహిళా కాంగ్రెస్ సలహాదారుగా రత్నమణి ఉల్క
కొరాపుట్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ముఖ్య సలహాదారుగా రత్నమణి ఉల్క నియమితులయ్యారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కొరాపుట్ పార్లమెంటరీ పరిధిలో మహిళా కాంగ్రెస్ నియామకాలు ప్రకటించింది. రత్నమణి ఉల్క కుమారుడు సప్తగిరి శంకర్ ఉల్క ప్రస్తుతం కొరాపుట్ ఎంపీగా కొనసాగుతున్నారు. దివంగత మంత్రి రామచంద్ర ఉల్క సతీమణి రత్నమణి ఉల్క. రామ చంద్ర ఉల్క సమయం నుంచే రత్నమణి ఉల్క కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకురాలిగా సేవలు అందజేశారు. గతంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. అలాగే పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. కుమారుడు ఎంపీ కాగా.. చాలాకాలం తర్వాత మరలా ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.