
కాంగ్రెస్‌లో చేరికలు
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి పరిధిలో గల గొగుపాడు, అదామ్‌గుడ, అచవ, పొల్లిడంగి, గొరుండ ప్రాంతాలకు చెందిన 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుణుపూర్‌లో గల బంగ్లాలో ఈ మేరకు గురువారం నాడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు (కాంగ్రెస్) బంచానిధి బెహర సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ ప్రజల గురించి చేస్తున్న సేవా కార్యక్రమాలు తమకు ఆకట్టుకున్నాయని అందువల్ల ఆ పార్టీలో చేరామని పార్టీలో చేరిన వారు తెలిపారు. కార్యక్రమంలొ కాంగ్రెస్ నాయకులు భిశ్వనాత్ బలియార్ సింగ్, నిలు సాహు, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.