
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఐఐఐటీ) విద్యార్థులు అఖిల భారత విశ్వవిద్యాలయాల యోగా చాంపియన్‌షిప్–2025కు ఎంపికయ్యారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నూజివీడులో జరిగిన అంతర్ కళాశాల యోగా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బి.భావన, కె.మేఘన వ్యక్తిగత విభాగంలో అర్హత సాధించారు. బృంద విభాగంలో ఎం.హేమరితిక, పి.కారుణ్య, ఎన్.నళిని, ఏ.రాధిక, జి.మహేశ్వరి, ఇ.భరత్‌సాయి, పి.జవితనాయుడు, ఎం.నవీన్‌కుమార్, కె.రాకేష్ అర్హత సాధించారు. వీరంతా నవంబర్ 24 నుంచి 28 వరకూ బెంగళూరులో జరగనున్న జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని వర్శిటీ సంచాలకులు ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, యోగా విభాగాధిపతి డాక్టర్ ఈశ్వరరావు, యోగా అధ్యాపకులు అర్చన, జి.ధనుంజయరావు, పీఆర్‌వో మామిడి షణ్ముఖరావు శుక్రవారం అభినందించారు.