
గుమ్మా బ్లాక్‌లో పంట నష్టం పరిశీలన
పర్లాకిమిడి: గుమ్మాబ్లాక్‌లో వరుస వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శుక్రవారం పరామర్శించారు. అధికంగా తరవ పంచాయతీలో ఆశ్రియగడ వంతె న కొట్టుకుపోగా, సుకేయి గ్రామంలో వరి పంట కోత యంత్రం కొట్టుకుపోయింది. అలాగే మడ్వాల్ గ్రామంలో పలువురు రైతుల వరి పంట వర్షాలకు పోయింది. ఎమ్మెల్యే రూపేష పాణిగ్రాహి బాధితులను పరామర్శించి పంట నష్ట పరిహారం కోసం అధికారులతో మాట్లాడతానని అన్నారు. ఆయన వెంట గుమ్మా బ్లాక్ అధ్యక్షురాలు సునేమీ మండళ్, గుమ్మా బీడీఓ దులారాం మరాండి, జూనియర్ ఇంజినీర్లు, బిజేడీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్ తదితరులు ఉన్నారు.