
డయాలసిస్ సేవలు సకాలంలో అందాలి
● జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ
శ్రీకాకుళం: జిల్లాలోని కవిటి, సోంపేట మండలా ల్లో కిడ్నీ వ్యాధి బారిన పడిన వారికి డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. శుక్రవారం జిల్లా పరిష త్ కార్యాలయంలో పలు స్థాయీ సంఘ సమావేశా లు ఆమె అధ్యక్షతన జరిగాయి. ఆమె మాట్లాడు తూ జిల్లా పరిషత్ సాధారణ సభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాలకు జిల్లా అధికారులు రాకుండా వారి ప్రతినిధులను పంపుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అధికారులు రాని పరిస్థితుల్లో ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. 4వ స్థాయీ సంఘ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో డయాలసిస్ బెడ్‌లు పెంచాలని అధికారులను కోరారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో జిల్లాలో చాలా మంది అర్హుల పింఛనుల జాబితాలు ఎంపీడీఓల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని సభ్యులు తెలపడంతో వాటిని క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో డీడబ్ల్యూఎంఏ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. 7వ స్థాయీ సంఘ సమావేశంలో పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ పనులు నిర్దేశించిన కాలంలో చేయకుండా కాలం చెల్లిన, మొదలు పెట్టని పనుల వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టు పైప్‌లైనులు ఎక్కువగా లీక్‌లు అవుతున్నాయని, సత్వరమే మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలన్నారు.
ఉదయం 3, 5, 6 వ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రగతి నివేదికలను అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు ధర్మాన కృష్ణచైతన్య, జంపు కన్నతల్లి, సురవరపు నాగేశ్వరావు, కె.త్రినాఽథ్, టొంపల సీతారాముడు, కాయల రమణ, కామాక భాగ్యవతి, మీసాల సీతం నాయుడు తదితరులు పాల్గొన్నారు.