
‘బాలలను ఓ కంట కనిపెట్టాలి’
పర్లాకిమిడి: సమాజంలో బాలలు నేర ప్రవృత్తికి దా రి తీయకుండా పెద్దలు చూసుకోవాలని డీఎల్‌ఎస్ ఏ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. గజపతి జిల్లా రాయగడ సమితి సన్నతుండి పంచాయతీలో చంపాపూర్ గ్రామంలో ఉచిత విద్యాహక్కు, జువైనెల్ జస్టిస్‌పై అవగాహన సదస్సును జిల్లా లీగల్ సర్వీసె స్ ప్రాధీకరణ కార్యదర్శి బిమల్ రవుళో అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు రాయగడ పోలీసు స్టేషన్ ఐఐసీ స్వప్నా చౌదురి, సన్నతుండి సర్పంచ్ సంఘమిత్ర శోబోరో, సహకార సమితి విద్యాధికారి జుధిష్టర బెహరా, సామాజిక కార్యకర్త లింగరాజ పాణిగ్రాహి, క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటరు లక్ష్మణరావు, తదితరులు హాజరై మాట్లాడారు. సమాజంలో చెడు వ్యసనాలు క్రైమ్‌కు దారితీస్తున్నా యని రాయగడ ఐఐసీ స్వప్నా చౌదురి అన్నారు.