
17 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో ఒక యువకుడిని రైల్వే, అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి 17.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన యువకుడు దినేష్ బిభర్‌గా గుర్తించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం కోర్టుకు తరలించారు. అబ్కారీ శాఖ అధికారి సంతోష్ కుమార్ ధల్ సామంత తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో బిభర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అతని బ్యాగును తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1.70 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.