
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
మల్కనగిరి: ఎంవీ– 84 గ్రామ సమీపంలో ఆదివా రం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తంగపా ల్ గ్రామానికి చెందిన రాజేష్ సొడి (20), బసంత కబాసి (18) దుర్మరణం పాలయ్యారు. బబులు మాడి అనేవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... ఒక మోటార్ సైకిల్‌పై రాజేష్, బసంత, బబులులు మారు రథ యాత్రను చూసేందుకు మల్కన్‌గిరి వెళ్లారు. రథయాత్రను చూసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఎంవి–84 గ్రామ సమీపంలో మోటారు సైకిల్ ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు కిందపడి గాయపడ్డా రు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల ను అంబులెన్స్‌లో మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించా రు. అయితే బసంత, రాజేష్‌లు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం