
జాతీయ స్థాయి బూత్ అధికారుల శిక్షణ ప్రారంభం
పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం హాల్‌లో గురువారం జాతీయ స్థాయి బూత్ అధికారుల శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, జిల్లా సామాజిక సురక్షా అధికారి సంతోష్ కుమార్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ శిక్షణ శిబిరంలో 136– మోహానా అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ సంఖ్య 297, 137– పర్లాఖిముండి నియోజికవర్గంలో 276 బూత్‌లు ఉన్నాయి. ఓటరు జాబితాలో కొత్తగా చేరాలనుకున్నావారు ఫారం 6, ఫారం 6(బి) ఓటరు పరిచయ పత్రానికి ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. ఫారం 8 ఓటరు జాబితాలో తన పేరు, అడ్రస్ సవరణ చేయాలన్నారు. ఓటర్లు నమోదు చేయడానికి ఓటరు హెల్ప్ లైన్‌లో బూత్ అధికారులకు ఫారం 6, 7, 8, 6(బి)ను అందజేయలన్నారు. ఈ శిక్షణ శిబిరంలో మోహానా అసెంబ్లీ నియోజకవర్గం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.