గజపతి స్టేడియంలో వికాస్‌ మేళా నేడు | - | Sakshi
Sakshi News home page

గజపతి స్టేడియంలో వికాస్‌ మేళా నేడు

Jun 14 2025 10:12 AM | Updated on Jun 14 2025 10:12 AM

గజపతి

గజపతి స్టేడియంలో వికాస్‌ మేళా నేడు

పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో ఏర్పాటు చేసి న వికాస్‌ మేళాను మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ శనివారం ప్రారంభించనున్నారు. ముందు గా బరంపురం నుంచరి పర్లాకిమిడి సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకుని వికసిత్‌ జిల్లా.. వికసిత్‌ ఒడిషా కార్యక్రమంలో పాల్గొంటారు. వికాస్‌ మేళా లో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పథకా లు, లబ్ధిదారులకు ప్రశంసాపత్రాలు, చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ నెల 20 వరకూ వికాస్‌ మేళా కొనసాగనుంది.

విద్యుదాఘాతంతో

యువకుని మృతి

రాయగడ: విద్యుత్‌షాకణతో యువకుడు ప్రాణాలు కోల్పోయా డు. ఈ సంఘటన జిల్లాలోని బిసంకటక్‌ సమితి హజారిడంగ్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడు రంజన్‌ కుమార్‌ సాహుకా ర్‌ (22)గా గుర్తించా రు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీ నం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బిసంకటక్‌ కోర్టులో ఏపీఆర్‌గా విధులు నిర్వహిస్తున్న రంజన్‌కుమార్‌ ఎప్పటిలాగే ఉదయం స్నానం చేసిన తరువాత ఇనుప తీగకు సమీపంలో ఉన్న తువ్వాలను శరీరం తుడుచుకోవడానికి తీసుకుంటుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణా లు కోల్పోయారు. అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మల్కన్‌గిరి పూర్వ కలెక్టర్‌కు బెయిల్‌

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా పూర్వ కలెక్టర్‌ మనీష్‌కుమార్‌ అగర్వాల్‌కు ఎస్‌డీజేఎం కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. 2019లో మనీష్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన వద్ద పీఏగా ఉన్న దేవనారాయణ్‌ పండా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన భార్య వనజ పండా తన భర్తను కలెక్టర్‌, మరో ముగ్గురు సిబ్బంది కలిసి హత్య చేశారంటూ మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాధ్‌ చేసింది. ఆ కేసులో మనీష్‌కు బెయిల్‌ మంజూరైంది.

వృద్ధురాలి మెడలో చైన్‌ చోరీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని పీఎన్‌కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో చైన్‌ తెంపేసి బైక్‌పై ఉడాయించాడు ఓ యువకుడు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌ కాలనీ మూడో లైన్‌ కమల నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కల్లేపల్లి ఈశ్వరమ్మ (62) తన సోదరితో కలసి ఫ్రెండ్స్‌ కాలనీలో బంధువులు చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి పీఎన్‌కాలనీ రెండో లైన్‌ చేరేసరికి ఓ 30 ఏళ్ల యువకుడు తలకు హెల్మెట్‌ ధరించి రయ్‌మని దూసుకొచ్చి నడుస్తున్న వృద్ధురాలి మెడలో మూడున్నర తులాల చైన్‌ తెంపేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మెడకు గాయమైంది. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎన్‌ కాలనీలో వరుసగా చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పుస్తెలతాడు చోరీకి విఫలయత్నం

మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన గేదెల మహాలక్ష్మి అనే మహిళ రహదారి నుంచి గ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెలతాడు తెంపుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. శుక్రవారం మహాలక్ష్మీ పెద్దలక్ష్మీపురం గ్రామానికి తన తండ్రి పెద్దకర్మకు వచ్చి తిరుగు ప్రయాణంలో గోకర్ణపురం గ్రామానికి వెళ్తుండగా..ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి మెడలో పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేయడంతో వారు పారిపోయారు. అనంతరం మహిళ మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించారని తెలియజేశారు.

పిడుగుపాటుకు

నాలుగు ఆవులు మృతి

ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో శుక్రవారం ఒంటిగంట సమయంలో ఉరుములతో కూడిన వర్షానికి చెట్టుమీద పిడుగుపడి కిందనున్న నాలుగు ఆవులు మృతి చెందాయి. ఇదే గ్రామానికి చెందిన పిట్ట అప్ప య్య ఓ చెట్టు కింద ఆవులు కట్టి ఉంచారు. ఒక్కసారిగా పిడుగుపడి ఆవులు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రెవె న్యూ సిబ్బంది, పశువైద్యాధికారులు సంఘట నా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.

గజపతి స్టేడియంలో  వికాస్‌ మేళా నేడు 1
1/3

గజపతి స్టేడియంలో వికాస్‌ మేళా నేడు

గజపతి స్టేడియంలో  వికాస్‌ మేళా నేడు 2
2/3

గజపతి స్టేడియంలో వికాస్‌ మేళా నేడు

గజపతి స్టేడియంలో  వికాస్‌ మేళా నేడు 3
3/3

గజపతి స్టేడియంలో వికాస్‌ మేళా నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement