తనయకు తలకొరివి పెట్టిన తల్లి
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన కాయల కాళిదాసు కుమార్తె కె.జ్యోతి(కేతన) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తండ్రి కాళిదాసు తీవ్రంగా గాయపడి జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు తలకొరివి పెట్టే పరిస్థితిలో లేకపోవడంతో తల్లి రాజేశ్వరి పుట్టెడు దుఃఖంతో అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన చూసి కాలనీవాసులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చిన్నారి సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు.
బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. విశాఖపట్నంలోని గాజువాక వేదికగా ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన 6వ ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్, పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో ఎస్.దేవి వరప్రసాద్ (54 కేజీల విభాగం) బంగారు పతకం, జి.సత్య భార్గవ్ (80+ కేజీల విభాగం) బంగారు పతకం, ఆర్.రామ్‌చరణ్ రెడ్డి (63 కేజీల విభాగం) రజత పతకం, పి.గణేష్ (75 కేజీల విభాగం) రజత పతకం, ఎస్.వినయ్ వరుణ్ (57 కేజీల విభాగం) కాంస్య పతకం, కె.యశ్వంత్ (46 కేజీల విభాగం) కాంస్య పతకం సాధించారు. వీరిని డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బీఏ లక్ష్మణదేవ్, వంగా మహేష్, కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు, సీనియర్ బాక్సర్లు అభినందించారు.
తనయకు తలకొరివి పెట్టిన తల్లి


