తులసీ పాహడ్‌లో కలెక్టర్ పర్యటన
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి తులసీ పాహడ్‌లో కలుక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ తొలిసారిగా పర్యటించారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఈ పర్వత ప్రాంతాల్లో జనం భయంభయంగా బతికేవారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ఇక్కడి పిల్లలు సైతం పాఠశాలల్లో చేరుతున్నారు. ఈ తరుణంలో కలెక్టర్ టెమురుపల్లి పంచాయతీ తులసీ, కీరమెట్ల, మారియా బెడా, చేరు కట్లా తదితర గ్రామాల్లో పర్యటించారు. పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అంతకుముందు తులసీ పాహడ్ వద్ద బీఎస్‌ఎఫ్ క్యాంపును సందర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ వినోద్ పటేల్, మత్తిలి గ్రామీణాభివృద్ధి విభాగం అధికారి కార్తీక్ నాయిక్, మత్తిలి బీడీఓ ప్రమోద్ కుమార్ బెహరా, సమితి ఈఈ హృదయ రంజన్ బాఘ్, ఏపీఓ లింగరాజ్ కరకరియా, సర్పంచ్ తుంబేశ్వర్ సమార్ద్ తదితరులు పాల్గొన్నారు.


