కొరాపుట్ జిల్లాకు రెజంగళ రాజ్ కలశ యాత్ర
జయపురం: చైనా యుద్ధంలో మరణించిన వీర సైనికులకు గుర్తుగా దేశవ్యాప్తంగా చేపడుతున్న రెజంగళ్ కలశ యాత్ర మంగళవారం కొరాపుట్ చేరింది. కొరాపుట్ జిల్లా యాదవ మహాసభ సభ్యులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. మహా సంఘ జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ నాయిక్ నేతృత్వంలో కార్యదర్శి రాజేంద్ర కుమార్ గౌడ, యాదవ మహాసంఘ రాష్ట్ర యువ సమాజ్ అధ్యక్షుడు అమర నాయిక్, ఉపాధ్యక్షుడు అమిత్ నాయిక్, కవిరాజ్ పరమేశ్వర పాత్రో, పరశురాం నాయిక్ మొదలైనవారు స్వాగతం పలికి యాదవ భవనానికి తోడ్కొని వచ్చారు.
కార్యక్రమంలో ప్రమోద్‌కుమార్ గౌడ, నరేంద్ర నాయిక్, రబీ నారాయణ గౌడ, రామచంద్ర మహంకుడో, హరిగౌడ, విజయ గౌడ తదితరులు పాల్గొన్నారు.


