రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నరసన్నపేట:
జాతీయ రహదారిపై గుండవల్లిపేట పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన సల్మాన్ (19) మృతి చెందాడు. ముందున్న లారీకి వెనుక నుంచి బలంగా చైన్నె నుంచి కోల్‌కతాకు వెళ్తున్న కార్గో లారీ బలంగా ఢీకొంది. దీంతో లారీ నడుపుతున్న సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నరసన్నపేట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి వాహనాలను క్రమబద్దీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


