
ఎస్‌బీఐ శాఖ ఏర్పాటుకు వినతి
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధి ముకుందపూర్‌లో ఎస్‌బీఐ శాఖను ఏర్పాటు చేయాలని స్థానిక బీజేపీ నాయకులు మానస్ కుమార్ దాస్, సంతోష్ మహాపాత్రోలు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్‌కు మంగళవారం వినతిపత్రంను అందజేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముకుందపూర్‌లో ఎస్‌బీఐ శాఖ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ముకుందపూర్‌కు సమీపంలో సుమారు 9 పంచాయతీలకు చెందిన ప్రజలు ఉన్నారని, అందువలన శాఖ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.