
ముంబై దంపతులకు శిశివు దత్తత
పర్లాకిమిడి: మహారాష్ట్రకు చెందిన దంపతులకు రాణిపేటలో ఉన్న స్వతంత్ర పౌష్య సంతాన స్వీకార కేంద్రంలోని శిశువును కలెక్టర్ బిజయ కుమార్ దాస్ దత్తతగా మంగళవారం అందజేశారు. మూడు నెలల క్రితం పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌లో ఎవరో వదిలి వెళ్లిన శిశువును ఈ కేంద్రానికి జిల్లా శిశు సురక్ష, సంక్షేమ శాఖ అధికారులు తరలించి సంరక్షించారు. మూడేళ్ల క్రితం కేంద్ర సంతాన దత్తత కేంద్రం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న ముంబైకి చెందిన ఈ దంపతులకు బిడ్డను చూపించగా వారు ఇష్టం ప్రకారం దత్తతగా స్వీకరించేందుకు అంగీకరించారు. కార్యక్రమంలో ఏడీఎం ఫాల్గుణి మఝి, శిశు సంక్షేమ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ మహాపాత్రో, డీసీపీయూ అరుణ్‌కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.